ఏపీలో మ‌రో ఎమ్మెల్యేకి క‌రోనా

ఏపీలో మ‌రో ఎమ్మెల్యేకి క‌రోనా

క‌రోనా వైర‌స్ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతూనే ఉంది.. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు క‌రోనా బారిన‌ప‌డి కోలుకోగా.. మ‌రికొంద‌రు ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు.. తాజాగా మ‌రో ఎమ్మెల్యేకి క‌రోనా సోకింది.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆయ‌న టెస్ట్‌లు చేయించుకోగా.. క‌రోనాగా నిర్ధార‌ణ అయ్యింది.. దీంతో.. హోం  క్వారంటైన్‌లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. ఎమ్మెల్యేకు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు వైద్యాధికారులు.. కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు.. స‌న్నిహితుల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.