టాలీవుడ్ స్టార్స్ అంత ఐసోలేషన్ లోనే !

టాలీవుడ్ స్టార్స్ అంత ఐసోలేషన్ లోనే !

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం టాలీవుడ్ సినీ పరిశ్రమపైన ఎక్కువగానే వుంది. ఇప్పటికే షూటింగ్స్ ఆగిపోగా.. థియేటర్స్ లో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక సెలెబ్రెటీలకు చాలా మందికి కరోనా సోకగా.. మరికొందరు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవలే కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా కోలుకున్నప్పటికీ కొద్దిరోజుల పాటు తన ఫామ్ హౌస్ లోనే ఉండనున్నారు. ఇక మహేష్ బాబు కూడా 'సరిలేరు నీకెవ్వరూ' యూనిట్ లో చాలా మందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లు కూడా షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి సెల్ఫ్ ఐసోలేషన్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఐతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం 'తగ్గేదే లే' అన్నట్లుగా షూటింగ్స్ పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఆయన నటిస్తున్న పుష్ప సినిమా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సంఖ్యతో ఫారెస్ట్ లో షూటింగ్ నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.