తూగోజిలో కొత్త కరోనా కలకలం.. మరిన్ని కేసులు ?

తూగోజిలో కొత్త కరోనా కలకలం.. మరిన్ని కేసులు ?

తూర్పుగోదావరి జిల్లాలో  కొత్త  కరోనా వైరస్ తొలికేసు నమోదు కావడంతో  కలవరం  నెలకొంది. ఈ నెల 23న బ్రిటన్ నుంచి రాజమండ్రి వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకు యు.కె. కరోనా  స్ట్ర్రెయిన్  నిర్ధారణ అయినట్లు తుది వైద్య పరీక్షల ఫలితాల్లో వెల్లడైంది. ప్రస్తుతం మహిళకు రాజమండ్రి ప్రభుత్వ కొవిడ్  ఆసుపత్రిలోని ఐసొలేషన్ లో చికిత్స అందిస్తుండగా... ఆమె ఆరోగ్యపరిస్థితి సాధారణంగానే ఉందనీ వైద్యలు చెబుతున్నారు. మరోవైపు యు.కె. నుంచి కాకినాడ తిరిగొచ్చిన మరో వ్యక్తి సహా కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటీవ్ నిర్ధారణ కాగా... అది సాధారణ కరోనా  వైరస్సా లేక యు.కె. స్ట్ర్రెయినా అనేది నమూనాల ఫలితాలు వస్తేగానీచెప్పలేని పరిస్థితి అంటున్నారు  వైద్య  అధికారులు. మొత్తం మ్మీద  ఈ నెల 8వ తేదీ  నుండి ఇప్పటి వరకు  జిల్లాకు యు.కె. నుంచి 114 మంది వచ్చినట్లు గుర్తించిన అధికారులు... వారికి సంబంధించి వెయ్యి 50  మంది కాంటాక్ట్స్ ఆరోగ్య పరిస్థితిపైనా నిఘా ఉంచి వైద్య పరీక్షలు  నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు.