ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లకు కరోనా వ్యాక్సిన్....

ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లకు కరోనా వ్యాక్సిన్....

ప్రపంచాన్ని వణికించిన కరోనా కు మన దేశంలో వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చే ప్రక్రియ పూర్తయితే అథ్లెట్లకు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే ఆరోగ్య శాఖను కోరామన్నారు. ఒలింపిక్స్ కు ఇంకా సమయం ఉండటంతో ఈ లోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అయితే కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే.