ప్రేమంటే ఇదేరా....

ప్రేమంటే ఇదేరా....

పక్కింటి వారిని కూడా దగ్గరకు చేరనివ్వని సమాజం ఉండే ఈ రోజుల్లో .... తన జాతి కాపోయినా .... రోజూ పాలిచ్చి కడుపునింపుతోంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన పలువురిని ఆలోచింపజేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఓ ఆవు నాలుగు కుక్క పిల్లలకు పాలిస్తోంది. ఒకసారి కాదు... రోజు ఆవు కుక్క పిల్లలకు పాలిచ్చి వెళ్లిపోతుంది. మరో విషయమేమంటే ఆ నాలుగు పప్పీల తల్లి ఇటీవలే ఓ ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ఆ గోమాత అక్కున చేర్చుకుని ఆ నాలుగు కుక్క పిల్లలకు పాలు ఇచ్చి కడుపు నింపుతోంది. ఈ ఘటనను ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.