రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం

రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం

ఇప్పటివరకు హైదరాబాద్ లో రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘన కింద 200 కేసులు నమోదు చేశామని తెలిపారు. 1,869 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నగదు తరలింపు ఘటనల్లో వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయడం లేదని, విచారణ కోసమే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నామని సీపీ చెప్పారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలపుడు నగదుతో పట్టుబడిన వారిలో 19మందికి శిక్షలు పడ్డాయన్నారు. నగదు పట్టుకుంటున్న ఘటనల్లో పౌరుల సహకారం బాగుందన్నారు. ప్రజలు ఇస్తున్న సమాచారంతోనే 70 శాతం నగదు పట్టుకున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు మరింత సహకరిస్తే ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా చూస్తామన్నారు.