ఏడు నెలల గరిష్ఠానికి ధరలు

ఏడు నెలల గరిష్ఠానికి ధరలు

వినియోగదారుల ధరల సూచీ మే నెలలో భారీగా పెరిగింది. ఏడు నెలల గరిష్ఠ స్థాయి 3.05 శాతానికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ నెలలో వినియోగదారుల ధరల సూచీ 2.99 శాతంగా నమోదైంది. ఏడు నెలల క్రితం 2018 అక్టోబర్‌లో ఈ సూచీ 3.38 శాతంగా నమోదైంది. మే నెలలో ఆహార వస్తువుల ధరలు 1.83 శాతం పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొన్ననే పరపతి విధానం ప్రకటించిన భారత రిజర్వు బ్యాంకు వినియోగదారుల ధరల సూచీ అదుపులోనే ఉంటుందని అంచనా వేసింది. వాస్తవానికి మే నెలలో 3.01 శాతం వరకు ద్రవ్యోల్బణం ఉండొచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు.