కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారు...

కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారు...

తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌ను సీసీఐ నేతలు కలిశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. కేసీఆర్ లక్ష్మణ రేఖ దాటారన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ చేస్తున్న హడావిడి, ఆయన తీరు చూస్తుంటే.. శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లికొడుకు, ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా అన్నట్టుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.