కౌన్సిల్‌ వ్యవస్థకు మేం వ్యతిరేకమే..! కానీ...

కౌన్సిల్‌ వ్యవస్థకు మేం వ్యతిరేకమే..! కానీ...

కౌన్సిల్ వ్యవస్థకు మా పార్టీ వ్యతిరేకం.. కానీ, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో బలం ఉందని ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు.. ఇది సరైంది కాదన్నారు సీపీఐ నేత నారాయణ.. మండలి రద్దుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన మండలి రద్దుకు తీర్మానం చేసినా సంవత్సరం కాలం పట్టవచ్చన్నారు. అమరావతి రాజధానిని 13 జిల్లాల ప్రజలు అంగీకరించారని గుర్తుచేశారు నారాయణ... కానీ, అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ అనడం సరైందికాదన్నారు. ఇక, ఆత్రంగా సీఎం జగన్ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరించిన సీపీఐ నేత.. జగన్ తీరువల్ల వ్యవస్థకు నష్టం అన్నారు. ఇక, అమిత్ షా హామీతోనే కౌన్సిల్ రద్దు విషయంలో జగన్ ముందుకు వెళ్లరని అనుకుంటున్నామని అనుమానాలను వ్యక్తం చేశారు నారాయణ.