నయీమ్‌ కేసు: పెద్దవారిని వదిలి.. చిన్నవారిపై చర్యలా..?

నయీమ్‌ కేసు: పెద్దవారిని వదిలి.. చిన్నవారిపై చర్యలా..?

తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టార్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత.. నయీమ్‌తో సంబంధాలు కలిగిఉన్నవారిపై, కలిసి దందాలు చేసినవారిపై, చూసిచూడనట్టు వ్యవహరించిన అధికారులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. తాజాగా మరో ఇద్దరు అధికారులపై రాచకొండ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. అయితే, నయీమ్‌కు సహకరించినందుకు కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నయీమ్‌కు గతంలో సహకరించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్‌కు సహకరించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించినవారిలో పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించామని గుర్తుచేసుకున్న నారాయణ... గ్యాంగ్‌స్టర్ నయీమ్ చనిపోయినా... అతని అనుచరులు బతికేఉన్నారని... ఆ ప్రభావం ఇంకా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.