'గ్లోబరినా' సంస్థను బ్యాన్ చేయాలి...

'గ్లోబరినా' సంస్థను బ్యాన్ చేయాలి...

ఇంటర్మీడియల్ ఫలితాల్లో అవకతవలకు కారణమైన గ్లోబరినా సంస్థను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ... విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని కోరారాయన. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, విద్యార్థుల చావులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వాహించాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ చేసిన పాపానికి దేవాలయాల చుట్టూ తిరుగుతోన్నారని విమర్శించిన నారాయణ... చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి.. సిట్టింగ్ జడ్జితో, “హై లెవెల్” కమిటీతో న్యాయ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 

“గ్లోబరినా” సంస్థ ఒక బోగస్ కంపెనీ అని గవర్నర్ నరసింహన్‌కు కూడా లేఖ రాసినట్టు తెలిపారు నారాయణ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత చర్యల వల్ల 25 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకున్నారని ఆరోపించిన ఆయన... ఇంటర్మీడియట్ బోర్డ్ అంతా కార్పొరేట్ మయం అయిపోయిందని మండిపడ్డారు. విద్యార్థులు కష్టపడి పరీక్షలు రాస్తే సున్న మార్కులు వేశారని.. “గ్లోబరినా” ఒక బోగస్  సంస్థ.. కాకినాడలో ఈ సంస్థను రద్దు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం “గ్లోబరినా” వంటి సంస్థకి ఔట్ సోర్స్ ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించిన నారాయణ..“గ్లోబరినా” సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.