సీఎం జగన్ ను చూసి విలువలు నేర్చుకోవాలి

సీఎం జగన్ ను చూసి విలువలు నేర్చుకోవాలి

ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఎవరైనా తమ పార్టీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలన్న ఏపీ సీఎం జగన్‌ను చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ విలువలు నేర్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ సీపీఐ నేతలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబుకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగేదేం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు. నమ్మకంతో గెలిపిస్తే ప్రజలను అమ్మి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమత సర్కార్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తున్న సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.