డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ధర్నాలు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ధర్నాలు

నేడు, రేపు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సాధన కోసం నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ తెలిపారు. భాగ్యనగర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాల కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిన్న సీపీఐ నేతలను కలిసి చర్చించారు. వారందరికీ అండగా ఉంటానని..  నగరంలోని పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇచ్చే వరకు ప్రభుత్వంపై పోరాడుతానని నర్సింహ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకురాలు ఛాయాదేవి, భాగ్యనగర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ నేతలు కనుకుల శ్రీనివాస్‌, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.