ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వమే లక్ష్యం..

ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వమే లక్ష్యం..

సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓడించడం, ప్రజల జీవన ప్రమాణాలు  మెరుగు పరచడం, ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సీపీఎం లక్ష్యం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్.. కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. సీపీఎం, సీపీఐ, జనసేన.. పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు స్వస్తి చెప్పడం ఏపీ ప్రజల కర్తవ్యం అన్నారు. ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద అజెండాను అమలు చేసిందని విమర్శించిన బృందాకారత్... జాతీయవాదం పేరుతో  సైనికులను, వారి త్యాగాలను కూడా బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవడానికి సీపీఎం పోరాటం చేస్తోందన్నారు.