జనసేన, లెఫ్ట్‌ కూటమి ఫలితాలపై రాఘవులు..

జనసేన, లెఫ్ట్‌ కూటమి ఫలితాలపై రాఘవులు..

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, వామపక్షాల కూటమి ఈ ఎన్నికల్లో వివిధ కారణాలతో కొన్ని చోట్ల ప్రభావవంతంగా పనిచేయలేక పోయింది. దాంతో అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. తొలి విడత పోలింగ్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహించిన తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. స్వయంప్రతిపత్తి సంస్థగా, స్వేచ్ఛగా, కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధవంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏపార్టీ ప్రజా పోరాటాలు చేపట్టినా తాము భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు రాఘవులు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ది కార్యక్రమాలు, సంక్షేమం కన్నా స్థానిక ప్రజాప్రతినిధులు అవినీతి ఈ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.