లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యేపై వేటు...

లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యేపై వేటు...

తమ పార్టీ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ జరిపిన కేరళ సీపీఎం శాఖ ఎమ్మెల్యే శశిపై వేటు వేసింది... పీకే శశిని పార్టీ నుంచి ఆరు నెలలు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే శశి తనతో అసభ్యంగా మాట్లాడుతూ... లైంగికంగా వేధిస్తున్నాడంటూ... యూత్‌ వింగ్‌లో పనిచేసే ఓ మహిళా నేత పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన పార్టీ... నిజానిజాలు తేల్చాల్సిందిగా... మంత్రి ఏకే బాలన్, ఎంపీ పీకే శ్రీమతితో కమిటీని ఏర్పాటు చేసింది... లైంగిక వేధింపులపై ఆరా తీసిన కమిటీ... మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదని తేల్చినా... సదరు ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడింది మాత్రం నిజమేనని నివేదిక ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే శశిని ఆరు నెలల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. మరోవైపు పార్టీ నిర్ణయంపై స్పందించిన ఎమ్మెల్యే శశి... పార్టీ తన జీవితంలో ఓ భాగం... పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.