ఆర్టీసీ సమ్మె: ఆత్మహత్యలు కావు.. ముమ్మాటికీ సర్కార్ హత్యలే..!

ఆర్టీసీ సమ్మె: ఆత్మహత్యలు కావు.. ముమ్మాటికీ సర్కార్ హత్యలే..!

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికీ సర్కార్ చేస్తున్న హత్యలేనని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్ సురేందర్‌గౌడ్ భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. ప్రభుత్వ తీరు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. చట్టబద్దమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చట్టవిరుద్ధంగా సీఎం కేసీఆర్ వ్యవహరించడం వల్లనే తెలంగాణలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... మూడు రోజుల్లో ఆర్టీసీలో 100శాతం బస్సులు తిప్పుతామని, విద్యాసంస్థలకు సెలవులిచ్చి, ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు కార్మికులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన వార్తను చూస్తూనే ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇక ఆ దిగ్భ్రాంతి నుండి తేరుకోకముందే హైదరాబాద్‌లో సురేందర్‌గౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడం ముమ్మాటికి ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని ఆరోపించారు. మా చావుకు ప్రభుత్వమే కారణంఅని సూసైడ్‌నోట్‌లో చనిపోయిన కార్మికులు పేర్కొన్నా.. ఆత్మబలిదానాలు చేసినా ముఖ్యమంత్రిలో చలనం రాకపోవడం ఆయన అహంభావానికి, నిరంకుశత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు తమ్మినేని వీరభద్రం.