హుజూర్‌నగర్ బరిలో సీపీఎం.. అభ్యర్థి పేరు ప్రకటన

హుజూర్‌నగర్ బరిలో సీపీఎం.. అభ్యర్థి పేరు ప్రకటన

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు రోజు రోజుకూ అసక్తికరంగా మారుతున్నాయి... ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ బరిలోకి దిగగా.. టీడీపీకి కూడా పోటీకి సై అంటోంది.. మరోవైపు కమ్యూనిస్టులు కూడా పోటీకి రెడీ అయ్యారు. అయితే, కమ్యూనిస్టులు మాత్రం ఏకమైనట్టు కనిపించడం లేదు. సీపీఎం.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చింది. పారేపల్లి శేఖర్‌రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. శేఖర్‌రావు రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో పొత్తకోసం టీజేఎస్, టి.టీడీపీ, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో ఇప్పటికే సీపీఎం చర్చలు జరిపింది. అయితే, ఒంటరి పోటీకే టీడీపీ మొగ్గుచూపడంతో.. సీపీఎం మిగతా మిత్రపక్షాలను కలుపుకొని పోటీచేయాలని నిర్ణయించింది. మరోవైపు అధికార టీఆర్ఎస్‌ కూడా పొత్తుకు ప్రయత్నం చేస్తోంది.. సీపీఐ నేతలతో ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు టీఆర్ఎస్‌ నేతలు. వారి మద్దతను కోరే అవకాశం ఉందంటున్నారు. అయితే, సీపీఐ వైఖరిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరి కమ్యూనిస్టు సోదరులతోనే కలిసి వెళ్తారా? లేక అధికార పార్టీకి అండగా ఉంటారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.