సీపీఎస్ కు నిరసనగా భోజన విరామ ప్రదర్శనలు

సీపీఎస్ కు నిరసనగా భోజన విరామ ప్రదర్శనలు

సీపీఎస్ రద్దు చేయనందుకు, ఐఆర్, పిఆర్సీ తదితర అంశాలు సీఎం హామీలు అమలు చేయనందుకు నిరసనగా సెప్టెంబర్ 18న అన్ని కార్యాలయాలు ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఐక్య ఉద్యమం పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాధ్యాయులు అందరూ తమ పాఠశాలల వద్ద.. ఉద్యోగులు వారి ఆఫీస్ల ముందు.. పెన్షనర్లు వారికి అందుబాటులో గల ఏదో ఒక పాఠశాల లేదా ప్రభుత్వ కార్యాలయం వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.