కూలిన క్రేన్, ఒకరు మృతి, స్తంభించిన ట్రాఫిక్..

కూలిన క్రేన్, ఒకరు మృతి, స్తంభించిన ట్రాఫిక్..

హైదరాబాద్‌లోని టోలీచౌకీ ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ క్రేన్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గోల్కొండ పరిధిలోని షేక్‌పేట దగ్గర జరుగుతోన్న ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల్లో ఈ ఘటన జరిగింది. మరోవైపు మెహిదీపట్నం - గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. క్రేన్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో... ఆ రోడ్డులో రకపోకలు నిలిపివేసిన అధికారులు... ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తెల్లవారుజామున 4 గంటలకు క్రేన్ కూలిపోగా... దానిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.