ముంబై లో కంగనా చీరలు..ఎగబడుతున్న జనాలు!

ముంబై లో కంగనా చీరలు..ఎగబడుతున్న జనాలు!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా రనౌత్ ఒక పక్క మొత్తం బాలీవుడ్ ఒక పక్క అన్నట్టు మారిపోయింది. సుశాంత్ ఆత్మహత్య కేసులో కంగన మహారాష్ట్ర సర్కార్ తీరును తప్పుపట్టడంతో నెటిజన్లు కంగనాకు నీరాజనం పడుతున్నారు. అంతే కాకుండా బాలివుడ్ లో వారసత్వం ద్వారా వచ్చిన తారలపై మండిపడుతున్నారు. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కంగనా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆ క్రేజ్ ను వస్త్ర వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. గతంలో కరీనా చీరలు, కత్రీనా చీరలు అనే పేర్లతో వస్త్రవ్యాపారులు చీరలను తయారు చేసారు. ప్రస్తుతం కంగనా క్రేజ్ కారణంగా గుజరాత్ లోని సూరత్ వస్త్ర వ్యాపారులు కంగనా చీరల పేరుతో మార్కెట్ లోకి చీరలను  తీసుకువచ్చారు. ఆ చీరలపై మణికర్ణిక సినిమాలోని కంగన ఫోటోను ముద్రించారు. ఐ సపోర్ట్ కంగనా అంటూ ప్రింట్ చేయించారు. కాగా  చీరలను కొనడానికి ముంబై మగువలు ఎగబడుతున్నారు.