'ఆదిపురుష్'పై అభిమానం పీక్స్ లో...

'ఆదిపురుష్'పై అభిమానం పీక్స్ లో...

సహజంగా హీరోలకు అభిమానులు ఉంటారు... అలానే కొన్ని సినిమాలకూ అభిమానులు ఉంటారు. అయితే వాళ్ళు సినిమా రంగంతో సంబంధం లేని బయటి వ్యక్తులై ఉంటారు. కానీ తాము వర్క్ చేస్తున్న సినిమాను ప్రాణంగా భావించే టీమ్... ఒకోసారి ఆ అభిమానాన్ని బాహాటంగా ప్రదర్శిస్తే... భలే చిత్రంగా ఉంటుంది. ఇటీవల 'ఆదిపురుష్' టీమ్ లోని ఓ వ్యక్తి తన బుగ్గ మీద, తల వెనుక భాగంలోనూ 'ఎ' సింబల్ వచ్చేలా షేవ్ చేసుకున్న ఫోటోలను ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ట్వీట్ చేశాడు. ఇలాంటి కమిటెడ్ టీమ్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. 'ఆదిపురుష్' క్లాప్ బోర్డ్ చేతిలో పట్టుకుని, ఫోటోకు ఆ యువకుడు ఫోజులిచ్చాడు. అతని మెడలోని ట్యాగ్ ను చూస్తే ప్రొడక్షన్ వ్యక్తి అని తెలిసిపోతోంది. ప్రభాస్, సైఫ్‌ అలీఖాన్, కృతీ సనన్ కీలక పాత్రలు పోషిస్తున్న మైథలాజికల్ త్రీడీ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. కరోనాకు సంబంధించిన అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ కీలకమైన షెడ్యూల్ మరో వారం పాటు ఉంటుందని తెలుస్తోంది.