క్రేజీ సెల్ఫీలు.. 

క్రేజీ సెల్ఫీలు.. 

నాలుగేళ్లుగా జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా పాటిస్తున్నారు. అయితే అదే రోజున సెల్ఫీ డే కూడా అనే విషయం చాలా మందికి తెలియదు. 2014 నుంచి జరుపుకుంటున్న సెల్ఫీ డే సందర్భంగా ఈ సెల్ఫీల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. సోషల్ మీడియా సైట్ ఇన్ స్టాగ్రామ్ లో సెల్ఫీ హ్యాష్ ట్యాగ్ తో ఇప్పటి వరకు సుమారుగా 350 మిలియన్ ఫోటోలు అప్ లోడయ్యాయి. ప్రతి సెకనుకు సుమారుగా 1,000 సెల్ఫీలు ఇన్ స్టాగ్రామ్ కి ఎక్కుతున్నాయి. ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా పది లక్షల సెల్ఫీలు తీస్తున్నారని ఓ అంచనా. కొరియాకి చెందిన ఫోన్ ఉత్పత్తిదారు శాంసంగ్ తెలిపిన వివరాల ప్రకారం తమ జీవితకాలంలో ఒక్కొక్కరు 25,000 సెల్ఫీలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొంది, షేర్ అయిన 12 అత్యంత పాపులర్ సెల్ఫీలివే.