కరోనా కట్టడికి విరాళం ప్రకటించిన సచిన్..!

కరోనా కట్టడికి విరాళం ప్రకటించిన సచిన్..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై పంజా విసుతోంది. భారత్ లోను వరుస కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య  ఇప్పటికే 724కు చేరింది. కాగా వారిలో 66 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.  కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. కాగా కరోనా ను అరికట్టడానికి ప్రముఖులు తమ వంతు విరాళం  ప్రకటిస్తున్నాను. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల నుండి ఇప్పటికే చాల మంది హీరోలు, నటులు తమ వంతు సాయం ప్రకటించారు. ఇక సినిమా రంగంతో పాటు క్రీడా రంగం నుండి కూడా భారీ  విరాళాలు అందుతున్నాయి. గౌతమ్ గంభీర్, ఎమ్ ఎస్ ధోని, పీవీ సింధు, సహా పలువురు క్రీడాకారులు విరాళాలు ప్రకటించారు. ఆ జాబితాలో ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా చేరారు. సచిన్ టెండూల్కర్ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతు విరాళం ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు మొత్తం 50 లక్షలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.