ఐపీఎస్ vs ఐఏఎస్...సందడిగా క్రికెట్ !

ఐపీఎస్ vs ఐఏఎస్...సందడిగా క్రికెట్ !


లాఠీ పట్టే చేతులు బ్యాట్ పడితే పెన్ పట్టే చేతులు బాల్ విసిరితే ఎలా ఉంటుంది... బొమ్మ అదిరిపోయింది. సరిగ్గా  కృష్ణాజిల్లాలో ఏపీ ఐఏయస్, ఐపీయస్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ దెబ్బకి స్టేడియం దద్దరిల్లిపోయింది. కృష్ణాజిల్లా మూలపాడు స్టేడియంలో జరిగిన సీఎస్ ఎలెవన్ వర్సెస్ డీజీ ఎలెవన్  మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ని తలపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన IPSల టీమ్ నిర్ణీత 20 ఓవర్లకి 148 పరుగులు చేసింది. కృష్ణకాంత్ ఐపీయస్ 56 బంతుల్లో 87 రన్స్ తో చెలరేగడంతో డీజీ ఎలెవన్ భారీ స్కోర్ చేసింది... కృష్ణకాంత్ కి తోడుగా రిషాంత్ రెడ్డి ఐపీయస్ , కెప్టెన్ కాంతిరానా టాటా ఐపీయస్ సహకారం అందివ్వడంతో సీఎస్ ఎలెవన్ ముందు 149 టార్గెన్ ఉంచగలిగింది. CS టీమ్ బౌలర్ అరుణ్ బాబు ఐఏయస్ 3 వికెట్లు తీసినా, పరుగులు భారీగా సమర్పించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కి దిగిన CS XI ..మొదటి నుండి దాటిగా ఆడడం ప్రారంభించింది... సీనియర్ ఐఏయస్ అధికారి కెప్టెన్  ప్రద్యమ్న, మహేష్ ఐఏయస్ లు  60 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ కు శుభారంభం ఇచ్చారు. అద్బుతమైన భాగస్వామ్యంతో దూసుకెళుతున్న జోడిని కాంతిరానా టాటా ఐపియస్ ,రిషాంత్ ఐపీయస్ విడగొట్టారు... వీరికి తోడు విషాల్ గున్ని కూడా మరో చేయి వేయడంతో వన్ సైడ్ మ్యాచ్ కాస్తా ఉత్కంఠ భరితంగా మారింది. స్లాగ్ ఓవర్స్ లో చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తూ CS XI ను విజయాన్ని దూరం చేశారు. చివరిగా 11 పరుగుల తేడా DG XI చేతిలో CS XI ఓటమి పాలైంది. 

DG XI టీమ్ ను ఎంకరేజ్ చేయడానికి dgp గౌతమ్ సవాంగ్,  CS XI టీమ్ ను ఎంకరేజ్ చేయడానికి ప్రవీణ్ ఐఏయస్ హాజరయ్యారు. మ్యాచ్ ఆసాంతం తమ ఆటగాళ్లని ఎంకరేజ్ చెస్తూ ఉల్లాసంగా గడిపారు.  బెస్ట్ బ్యాట్స్ మెన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కృష్ణకాంత్ ఐపీయస్ , బెస్ట్ బౌలర్ గా కాంతిరానా టాటా ఎంపికయ్యారు. నిత్యం బిజి బిజి గా గడిపే తమ అధికారులకు ఇటువంటి ఆటవిడుపు వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు ఏపీ డీజిపి గౌతమ్ సవాంగ్.  వరుసగా రెండో ఏడాది కూడా విన్నర్ గా గెలవడం ఆనందంగా ఉందన్నారు డీజీపీ. మ్యాచ్ అంత ఒకెత్తు అయితే ఎప్పుడూ యూనిఫామ్ లో ఉండే  డీజిపి సవాంగ్ టీషర్ట్, ట్రాక్ ఫ్యాంట్‌తో కూల్ కూల్‌గా కనిపించారు.