ఓటు వేసిన టీమిండియా క్రికెటర్‌

ఓటు వేసిన టీమిండియా క్రికెటర్‌

దేశ వ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికలు ఉత్సాహంగా సాగుతున్నాయి. టీమిండియా క్రికెటర్‌ ఛటేశ్వర్‌ పూజారా ఇవాళ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పరిధిలో ఉన్న మదాపర్‌లో పుజారా ఓటు వేశారు. పుజారా తండ్రి, పుజారా భార్య కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
ఇక.. ఉదయం 11 గంటల నాటికి అస్సాం-28.07%, బీహార్-20.80%, గోవా-16.88%, గుజరాత్-13.24%,  కర్ణాటక-12.72%, కేరళ-21.09%, మహారాష్ట్ర-9.03%, ఒడిశా-8.67%, త్రిపుర-15.29%, ఉత్తరప్రదేశ్-16.28%, జమ్మూకశ్మీర్-3.39%, పశ్చిమ బెంగాల్-23.85%, ఛత్తీస్‌గఢ్-19.31%, దాద్రా నగర్ హవేలీ -11.40%, డామన్&డయ్యూ-19.43%లో పోలింగ్ జరిగింది.