మొతేరా పిచ్ పై మైకెల్‌ వాన్‌ మరోసారి...

మొతేరా పిచ్ పై మైకెల్‌ వాన్‌ మరోసారి...

ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించినప్పటి నుంచి ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చాడు. అసలు ఇది టెస్టు మ్యాచ్‌ నిర్వహించాల్సిన పిచ్‌  కాదని..  మూడో టెస్టులో ఎవరు విజయం సాధించలేదని.. టీమిండియా ఏం చేసినా ఐసీసీ అభ్యంతరం చెప్పకుండా అనుమతిస్తుందంటూ ఇంగ్లీష్‌ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టుకు సంబంధించి మొటేరా పిచ్‌ను క్యురేటర్‌ ఏ విధంగా రూపొందిస్తున్నాడో చూడండంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్‌  చేశాడు. ఆ ఫోటోలో ఒక రైతు తన ఎద్దులతో పొలం దున్నుతున్నట్లుగా ఉంది. ఈ ఐదు రోజులు కూడా పిచ్‌ స్పిన్‌కు అనుకూలించేలా రూపొందిస్తున్న అతన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా'అంటూ కామెంట్‌ చేశాడు. వాన్‌ షేర్‌ చేసిన ఫోటో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.