తిరుమల చేరుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ

తిరుమల చేరుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ

టీమిండియా వైస్ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం చెన్నై నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు వచ్చారు. ఈ రాత్రికి అక్కడే బసచేసి గురువారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్‌ 12లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరింది. మే 12న హైదరాబాద్‌లో రోహిత్‌ సేన ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.