రిటైర్మెంట్ ప్రకటించాక యువీ కీలక వ్యాఖ్యలు..

రిటైర్మెంట్ ప్రకటించాక యువీ కీలక వ్యాఖ్యలు..

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ముంబైలో మీడియాతో మాట్లాడిన యువీ... తన రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు నేను అన్‌ఫిట్.. నన్ను నేను ప్రూవ్ చేసుకోలేని సమయంలో నేను రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నానని వెల్లడించిన యువీ... 2011 వరల్డ్ కప్ నేనెప్పుడూ మర్చిపోను.. నా కెరీర్‌లోనే అది గొప్ప విజయంగా చెప్పారు. మనపై మనకు నమ్మకం ఉంటే.. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చ యువరాజ్.. తాను సచిన్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్ వంటి క్రికెట్ లెజెండ్స్ తో కలిసి ఆడటం గర్వంగా ఉందన్నారు. నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటానని కాస్త భావోద్వేగానికి గురైన యువీ... క్రికెట్ కోసం నా రక్తం, చెమట ధారపోసానని పేర్కొన్నాడు. ఇక, క్యాన్సర్ పేషంట్స్ కి సాయం చేయడం నా తదుపరి లక్ష్యమని ప్రకటించారు యువీ... నాలాగే క్యాన్సర్ తో ఎవరూ బాధ పడొద్దు అన్నదే నా ఆశ.. కొన్ని ఎన్జీవోలతో టైఅప్ అయ్యాం... క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటానని వెల్లడించారు. 

తాను 10 వేల రన్స్ క్లబ్ లో చేరలేకపోయా అని ఎప్పుడూ బాధ పడలేదు... దాని గురించి ఆలోచించలేదన్నారు యువరాజ్ సింగ్... వరల్డ్ కప్ సాధించడమే గ్రేట్ విక్టరీగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చిన ఆయన.. రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి అమ్మ, భార్యతో డిస్కస్ చేస్తున్నాను... వాళ్లు చాలా బాధపడ్డారు... వద్దన్నారని తెలిపారు. ఇక, నేను చివరగా మ్యాచ్ ఆడుతూ.. సహచరుల మధ్య రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకోలేదు... అలా బీసీసీఐకి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు. తనకు కెరీర్‌లో గంగూలీ, ధోనీ చాలా సహాయం చేశారని గుర్తుచేసుకున్న యువీ... రిటైర్మెంట్ గురించి రెండేళ్లుగా అనుకుంటున్నా... ఈ రెండేళ్లుగా తాను ఫామ్‌లో కూడా లేను... నన్ను నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే.. రిటైర్మెంట్ కరెక్ట్ అనిపించిందన్నారు. ఇక తన కెరీర్‌లో టఫ్ బౌలర్ ముత్తయ్య మరళీధరన్, నచ్చిన బ్యాట్స్‌మన్ రికీపాంటింగ్‌గా వెల్లడించాడు యువీ.