ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్ చాహల్

ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్ చాహల్

మరో టీమిండియా క్రికెటర్‌ ఓ ఇంటివాడయ్యాడు.. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పాపులర్ యూట్యూబర్ ధనశ్రీ వర్మను పెళ్లాడాడు..గురుగ్రామ్‌లోని కర్మా లేక్ రిసార్ట్ వీరి వివాహ వేడుకగా ఘనంగా జరిగింది.. కాగా, చహల్, ధనశ్రీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు... యూట్యూబ్ లో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలు చూసిన ప్రేమలో పడిపోయిన చాహల్.. ఆ తర్వాత లవ్‌లో పడిపోయాడు.. గత ఆగస్టులోనే వీరికి రోకా వేడుక జరిగింది.. ఆ సమయంలో తన ప్రపోజల్ గురించి చహల్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేశాడు.. ఇక, గుర్‌గ్రామ్‌లో ఇవాళ పెళ్లికి సంబంధిచిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తమ వివాహ ఫొటోలను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఆ వెంటనే షేరింగ్‌లు, లైక్‌లు, కామెంట్లు ఇలా వైరల్‌గా మారిపోయాయి.. మొత్తంగా చాహల్-ధనశ్రీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.