అలియా సాహసానికి క్రిటిక్స్ ఫిదా

అలియా సాహసానికి క్రిటిక్స్ ఫిదా
అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన రాజీ చిత్రం శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  ఇందులో అలియా కాశ్మీరీ యువతిగా కనిపించింది.  తండ్రే లోకంగా బ్రతికే అలియాకు ఇక్బాల్ సయ్యద్ అనే పాకిస్తానీ యువకుడితో వివాహం చేయాలనీ అనుకుంటాడు.  ఇక ఇక్బాల్ పాక్ సైన్యంలో పనిచేస్తుంటాడు.  పెళ్లి తరువాత అలియా భర్తతో కలిసి పాక్ వెళ్తుంది.  పెళ్లి తరువాత అలియా ఎందుకు పాకిస్తాన్ వెళ్లాలనే విషయాన్ని తండ్రి ఆమెకు వివరిస్తాడు.  తండ్రి ఆజ్ఞమేరకు, పుట్టిన భూమిని రక్షించుకోవడానికి భర్తతో కలిసి పాక్ వెళ్తుంది.  ఆలా వెళ్లిన అలియా, భర్తతో సంతోషంగా ఉంటూనే, భారత్ పై పాక్ పన్నుతున్న కుట్రలను పసిగడుతుంది.  ఆమె తెలుసుకున్న సమాచారాన్ని భారతదేశంలోని అధికారులకు చేరవేస్తుంది.  పెళ్లి తరువాత పాక్ చేరుకున్న అలియా అక్కడ ఎలా గూడాచార్యం చేసింది.. ఎలాంటి సాహసాలు చేసింది.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది సినిమా.  
తల్వార్ చిత్రాన్ని రూపొందించిన మేఘనా గుల్జార్ రాజీ చిత్రానికి దర్శకత్వం వహించారు.  దేశభక్తిని చాటే రీతిలో ఈ సినిమాను తెరకెక్కించింది మేఘనా.  నిన్ను ప్రేమించాను..కానీ, దేశం కన్నా నాకేది ఎక్కువ కాదు.. ఆఖరికి నువ్వుకూడా అనే డైలాగ్ రాజీకి దేశంపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.  ఇక రాజీ సినిమాకు క్రిటిక్స్ అదిరిపోయాయి.  దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలని ప్రముఖ పత్రికలు, వెబ్ సైట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాయి.  ప్రతి ఒక్కరు ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఇవ్వడం విశేషం.  సినిమా నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ కు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేస్తున్నారు.