అర్జెంటినాకు క్రొయేషియా షాక్

అర్జెంటినాకు క్రొయేషియా షాక్

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో లియోనల్ మెస్సీ వంటి స్టార్ ప్లేయర్ ఉన్న అర్జెంటినాకు పెద్ద షాక్. గ్రూప్-డిలో జరిగిన కీలక మ్యాచ్ లో క్రొయేషియా 3-0 గోల్స్ తేడాతో అర్జెంటినాపై నెగ్గి క్వార్టర్ ఫైనల్స్ లో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకొంది. ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు గోల్ చేసి ఆధిక్యం సాధించేందుకు హోరాహోరీగా పోరాడాయి. అర్జెంటినా కెప్టెన్ మెస్సీ ఎంత ప్రయత్నించినా క్రొయేషియా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు.  సెకండ్ హాఫ్ లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఆట 53వ నిమిషంలో అర్జెంటినా గోల్ కీపర్ కాబరెల్లో పొరపాటు కారణంగా క్రొయేషియా ఆటగాడు రెబిక్ తొలి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. 80వ నిమిషంలో మోడరిక్ కర్ల్ షాట్ తో సూపర్ గోల్ కొట్టి దానిని 2-0కి పెంచాడు. ఆ షాక్ నుంచి అర్జెంటినా జట్టు తేరుకొనేలోగా 91వ నిమిషంలో రాక్ టిక్ కొట్టిన మూడో గోల్ తో ఆటపై పట్టు బిగించిన క్రొయేషియా, ఆ తర్వాత అర్జెంటినాకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. అసలే ఐస్ ల్యాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ డ్రా కావడంతో వరల్డ్ కప్ లో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటినా దారుణంగా విఫలం కావడంతో ఆ జట్టు అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.