చుక్కల్లో చమురు ధరలు

చుక్కల్లో చమురు ధరలు
భయపడినంతా జరుగుతోంది. సౌదీ అనుకున్నంత పని చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్‌ కొనసాగడంతో పాటు గల్ఫ్ దేశాల్లో గొడవల కారణంగా నెల రోజుల నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో  డాలర్ విలువ తగ్గకపోవడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఆసియా దేశాలు బ్రెంట్‌ క్రూడ్‌ను కొనుగోలు చేస్తాయి. దాదాపు నెల రోజుల క్రితం బ్యారెల్ ముడి చమురు ధర 60 నుంచి 63 డాలర్లమధ్య ఉండగా ఇపుడు ఏకంగా 74 డాలర్లకు చేరింది.  దాదాపు 20 శాతం పెరిగిందన్నమాట. అమెరికా మార్కెట్‌కు ప్రాతినిధ్యం వహించే డబ్ల్యూటీఐ (నైమెక్స్‌) చమురు ధర మూడేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. బుధవారం వెలువడిన వారపు చమురు ధరలు నిల్వల  డేటాతో చమురు ధర ఏకంగా మూడు శాతం పైగా పెరిగి ఒకదశలో 69 డాలర్లకు  చేరింది. అమెరికాలో వేసవి డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. సెలవుల కారణంగా జనం విహార యాత్రలకు బయలుదేరుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో చమురు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సౌదీ అరేబియా అన్నట్లు బ్రెంట్‌ చమురు ధర 80 డాలర్లకు చేరేలా ఉంది.  ఇటీవల ట్రంప్‌ కల్పించిన పన్ను రాయితీల కారణంగా జనం వద్ద  డబ్బు సరఫరా పెరిగింది. అలాగే నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. ఇవన్నీ చూస్తుంటే చమురు ధరల్లో స్వల్ప ఒడుదుడుకులు ఉన్నా… భారీ పతనం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. brent