19 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు చోరీ

19 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు చోరీ
దేశంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ చోరీ జరిగింది. తమ సంస్థకు చెందిన రూ.19 కోట్ల విలువైన 438 బిట్‌ కాయిన్లు విత్‌డ్రా అయినట్టు ఢిల్లీకి చెందిన క్రిప్టో కరెన్సీఎక్స్‌చేంజ్‌ కాయిన్‌ సెక్యూర్‌ సంస్థ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ సిస్టమ్స్‌ హ్యాకింగ్‌కు గురవలేదని, ఇది సంస్థలోని వారి పనేనని చెప్పింది. కస్టమర్లకు ఇవ్వడానికి బిట్‌కాయిన్ గోల్డ్‌ను తీస్తున్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా తెలిపింది. తమ సీఎస్‌వో డాక్టర్ అమితాబ్ సక్సేనాపై సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. వ్యాలెట్‌ నుంచి ఈ నగదును అమితాబ్‌ సక్సేనా దొంగతనం చేసి ఉండవచ్చని, ఆయన దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆయన పాస్‌పోర్టు సీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా.. వినియోగదారులు ఆందోళన చెందక్కర్లేదని, వాళ్లకు కలిగిన నష్టాన్ని సంస్థ ఖజానా నుంచి భర్తీ చేస్తామని చెప్పింది.