సీఎంతో ముగిసిన సీఎస్ భేటీ...

సీఎంతో ముగిసిన సీఎస్ భేటీ...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం ముగిసింది. ఎన్నో వివాదాలు, రాజకీయాల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సీఎం, సీఎస్ మధ్య భేటీ సుమారు గంట పాటు కొనసాగింది. అనంతరంలో సీఎస్ తిరిగి సచివాలయానికి వెళ్లిపోయారు. అయితే, వీరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందని తెలియాల్సి ఉన్నా... ముఖ్యంగా కేబినెట్ సమావేశంపైనే చర్చ సాగినట్టు భావిస్తున్నారు. మరోవైపు రేపు జరనున్న కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేబినెట్‌ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్ర్కీనింగ్‌ కమిటీ... ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపించారు. ఈ నెల 10వ తేదీన ఆ నివేదికను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపండం జరిగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాశంగా మారింది. ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆ నిసంబధన ప్రకారం ఆదివారం సాయంత్రానికి సమయం అయిపోయింది. అయితే, ఇవాళ అనుమతి వస్తుందని భావిస్తున్నా... నేటి సాయంత్రం వరకు ఈసీ నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ నిర్వహించే అవకాశం ఉంటుంది.