ఈసీ అనుమతి కోసం వేచిచూస్తున్నాం-సీఎస్

ఈసీ అనుమతి కోసం వేచిచూస్తున్నాం-సీఎస్

అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమావేశం ముగిసింది... అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రిని కలిసి కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండాపై వివరించినట్టు తెలిపారు. ఇక కేబినెట్ సమావేశం కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు వెల్లడించారు సీఎఎస్. కాగా, కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలన్న అంశంపై కూడా సీఎం, సీఎస్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. కరువు, ఫణి తుపాన్, తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), ఆయా శాఖల కార్యదర్శులతో మాత్రమే సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు.