సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌  

సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌  

చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరబాద్ పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. భువీ, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. వాట్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్స న్‌ స్వదేశం వెళ్లడంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడి స్థానంలో షకీబుల్‌ హసన్‌ తుది జట్టులోకి వచ్చాడు.