చెన్నైకి చేరుకున్న సిఎస్కే ఆటగాళ్లు...

చెన్నైకి చేరుకున్న సిఎస్కే ఆటగాళ్లు...

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ జరుగుతుంది అని బీసీసీఐ ప్రకటించడంతో ఆటగాళ్లు అందరూ అందుకు సన్నద్ధమవుతున్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 జరగనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కే) ముఖ్య ఆటగాడైన రైనా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. దానికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 19 న ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు ఆగస్టు 21 న యూఏఈ కి బయలుదేరనున్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి ముందు సిఎస్కే ఇక్కడ ఓ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 15 నుంచి 20 మధ్య జరిగే ఆరు రోజుల శిక్షణా శిబిరంలో సిఎస్కే ఆటగాళ్లు పాల్గొంటారు. అందుకోసం సురేష్ రైనా ఫ్లైట్ లో చెన్నై కి వచ్చాడు. అయితే ఆ సమయం లో తీసిన ఓ ఫోటోను రైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందులో రైనాతో పాటుగా సిఎస్కే ఆటగాళ్లు దీపక్ చాహర్, బరీందర్ శ్రాన్, పియూష్ చావ్లాతో కలిసి కొంతమంది సిబ్బంది ఉన్నారు.