లాక్ డౌన్ లో ట్రాక్టర్ నడుపుతున్న ధోని...

లాక్ డౌన్ లో ట్రాక్టర్ నడుపుతున్న ధోని...

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో లాక్ డౌన్ సమయాన్ని ఖర్చు చేయడంలో బిజీగా ఉన్నందున సోషల్ మీడియా‌కు దూరంగా ఉన్నారు. కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో, ధోని రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో తన బైక్‌ నడిపే వీడియోను చాల సార్లు తన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ధోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్రాక్టర్‌ నడుపుతున్న భారత మాజీ కెప్టెన్ వీడియోను పంచుకున్నారు. అయితే ఆ వీడియోకు మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మౌనా రాగం నుండి ఓ పాట కూడా జత చేసారు. అంతకుముందు, ధోని భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో వికెట్ కీపర్ బాట్స్మెన్ తన కుమార్తె జివాతో మోటారుసైకిల్‌ను నడుపుతున్న  వీడియోను పోస్ట్ చేసింది. 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ ఓడిపోయినప్పటి నుండి ధోని అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 2019 హోమ్ సీజన్లో ధోని అనేక సిరీస్లను కోల్పోయాడు మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనలో కూడా దూరమయ్యాడు.