మార్చి 2న గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్న ధోని!

మార్చి 2న గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్న ధోని!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గతకొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కొంతకాలం ఇండియన్ ఆర్మీ లో శవాలను అందించిన ధోనీ త్వరలో తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ధోని తన ప్రాక్టీస్ ను మొదలుపెట్టనున్నాడు. త్వరలో ఐపీల్ సీజన్ స్టార్ట్ అవ్వనుంది.చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోనీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటకే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా, అంబటి రాయుడులతో పాటు మరికొంత మంది గత మూడు వారాలుగా ప్రాక్టీస్ లో ఉన్నారు. మార్చి 2న వీరితో ధోని కాలవనున్నాడు. అదే నెల 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్‌ మ్యాచ్ ల్లోనూ పాల్గంటారని, సీఎస్కే ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ధోని ఎంతో కీలకమైంది. ఈ టోర్నీలో సత్తా చాటి తిరిగి టీ 20 జట్టులో చోటు దక్కించుకోవాలని ధోని చూస్తున్నాడు.  గతేడాది రన్నరప్‌ గా నిలిచిన సీఎస్‌కే ఈ సారి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మొత్తం ఐపీఎల్ సీజన్స్ లో మూడుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై ఐదు సార్లు రన్నరప్ గా నిలిచింది.