కుకూ శబ్దం అతన్ని కుబేరుణ్ని చేసింది

కుకూ శబ్దం అతన్ని కుబేరుణ్ని చేసింది

ఒక చిన్న ఐడియా పెద్ద మార్పుకు కారణమైనట్టే... ఇళ్లలో సంప్రదాయంగా వండుకునే కామన్ ఫుడ్డే ఓ అదృష్టవంతుడిని కోటీశ్వరుణ్ని చేసింది. బాబీ యూన్ అనే కొరియన్ పర్సన్.. న్యూయార్క్ లో రెస్టారెంట్ నడుపుకుంటాడు. అందరిలా కామన్ డిషెస్ పెడితే ఏం బావుటుందనుకున్నాడో ఏమో.. కొరియా సంప్రదాయ ఫుడ్డయిన కుకూ తో వ్యాపారం చేద్దామనుకున్నాడు. 

ఆలోచన వచ్చిందే తడవు అమల్లో పెట్టేశాడు. కుకూ అనేది కొరియా ప్రజలకు సాధారణ వంటకం. ఓ రకంగా తెలుగోడి వరి అన్నం లాంటిదే. కాకపోతే కొరియన్లు పొడవైన గింజలు కాకుండా పొట్టి గింజలతో కుకూను వండుతారు. చాలా తక్కువ ఉష్ణోగ్రత మీద ఉడికించే ప్లెయిన్ రైస్ గా దీన్ని పేర్కొనవచ్చు. అయితే అది మన దగ్గర దొరికే బియ్యం కాకుండా అక్కడ దొరికే బియ్యాన్ని పోలిన గింజలన్నమాట. ఆ ధాన్యాన్ని కుకర్ మీద పెట్టి మూత పెట్టేస్తే ఉడికింతర్వాత కూ-కూ అంటూ శబ్దంతో వంట అయిపోయిందన్న సిగ్నల్ వస్తుంది. అందువల్లే దానికి కుకూ అనే పేరొచ్చింది. ఇందులో బుల్గోజి, కిమ్చి జిగే అనే వెరైటీ వంటకాలుంటయి. అన్నిటికన్నా కుకూకే మంచి పేరొచ్చింది. ఈ డిష్ మంచి రుచికరంగానే కాక బలవర్ధకమైన ఆహారమట. దీన్ని రెస్టారెంట్లో ఇంట్రడ్యూస్ చేసి పాపులర్ చేయడంతో కుకూ హోల్డింగ్స్ కంపెనీ ఫౌండర్ ని బిలియనీర్ ని చేసింది. 

Image: Chicago Business