జమ్ములో కర్ఫ్యూ కొనసాగింపు 

జమ్ములో కర్ఫ్యూ కొనసాగింపు 

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా ఘటన అనంతరం జమ్ములో విధించిన కర్ఫ్వూ కొనసాగుతోంది. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణలో భాగంగా ఉన్నతాధికారులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల కింద పలువురిని అరెస్టు చేశారు. ఆందోళకారులు ఇవాళ అక్కడక్కడ రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఉగ్రదాడులను సాకుగా చేసుకుని అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందన్నారు. అందరూ ఐక్యంగా ఉండి అరాచక శక్తులకు ఎదుర్కోవాలని ఉన్నతాధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా బలగాలను జమ్ముతోపాటు ఇతర నగరాల్లో రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత వాయుసేన సైతం గస్తీ నిర్వహిస్తోంది.

మరోవైపు...  కశ్మీర్‌లో కూడా సాధారణ జనజీవనం స్తంభించింది. జమ్ముతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కశ్మీరీ ప్రజలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పలు వ్యాపార సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.