శ్రీలంక అంతటా కర్ఫ్యూ

శ్రీలంక అంతటా కర్ఫ్యూ

వరుస పేలుళ్ళతో దద్దరిల్లిన శ్రీలంలో కర్ఫ్యూ విధించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  దేశ వ్యాప్తంగా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మందు జాగ్రత్త చర్యగా దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాపై నిషేధం విధించింది ప్రభుత్వం. దీంతో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలన్నీ ఆగిపోయాయి. దీంతో పాటు మెసేజింగ్‌ సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో పరిస్థితిని సమీక్షించిందేందుకు వెంటనే అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్సాటు చేశారు దేశ ప్రధాని రణిల్‌ విక్రమ్‌సింఘే.దేశవ్యాప్తంగా 200 ట్రూప్‌లోను మోహరించారు. భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు.