అప్పుడే బయట పెడితే ఎలా..?

అప్పుడే బయట పెడితే ఎలా..?

సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు ఉన్న క్రేజ్ శాండల్ వుడ్ కు లేదు.  ఎన్ని సినిమాలు వస్తున్నా.. ఎన్ని హిట్స్ కొడుతున్నా.. శాండల్ వుడ్ ఇండస్ట్రీ ఎందుకో మిగత వాటితో పోటీపడలేకపోయింది.  ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమాతో అంతా మారిపోయింది.  

కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్టైంది. ఏకంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  ఇప్పడు సెకండ్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు.  ఇందులో హీరో యాష్ లుక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.  కొన్ని రోజుల క్రితం ఓ లుక్ బయటకు వచ్చినా.. అది కేజీఎఫ్ లుక్ కాదని, సినిమాలోని లుక్ ను బయటపెట్టాలంటే కొన్ని రోజుల సమయం పడుతుందని అంటున్నాడు హీరో.