క‌రోనా క‌ల్లోలం.. నిలిచిపోయిన క‌రెన్సీ ప్రింటింగ్..

క‌రోనా క‌ల్లోలం.. నిలిచిపోయిన క‌రెన్సీ ప్రింటింగ్..

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోంది.. క్ర‌మంగా మ‌ళ్లీ క‌ఠిన‌మైన ఆంక్ష‌లు, క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ వైపు అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి.. ఇప్పుడు కోవిడ్ ప్ర‌భావం ఏకంగా క‌రెన్సీ ఫ్రింటింగ్ పై కూడా ప‌డింది.. క‌రోనా క‌ట్ట‌డి కోసం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుకుంది.. ‘బ్రేక్ ది చైన్’ క్యాంపెయిన్‌‌ను ప్రారంభించింది.. దీనిపై స్పందించిన నాసిక్‌లోని కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్, ఇండియా సెక్యూరిటీ ప్రెస్ క‌రెన్సీ ప్రింటింగ్ నిలిపివేసింది.. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు కరెన్సీ ప్రింటింగ్ నిలిపివేసిన‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది మాత్రం అక్క‌డ విధుల‌కు హాజ‌రుఅవుతున్న‌ట్టు వెల్ల‌డించింది.. కాగా, భార‌త్‌లో చలామణీలో ఉండే క‌రెన్సీలో.. 40 శాతం నాసిక్‌లోనే ప్రింట్ అవుతుంది.. దాదాపు 3 వేల మంది ఇక్క‌డ ప‌నిచేస్తుండ‌గా.. కోవిడ్ ఎఫెక్ట్ ఇప్పుడు క‌రెన్సీ ప్రింటింగ్‌పై కూడా ప‌డింది.