పాక్- శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం

పాక్- శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. ఇరు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లాడి ఒక విజయం, ఒక పరాజయంతో కొనసాగుతున్నాయి.