వర్మకు నోటీసులు..రేపు హాజరుకావాలని పోలీసుల ఆదేశాలు

వర్మకు నోటీసులు..రేపు హాజరుకావాలని పోలీసుల ఆదేశాలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోడలు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వర్మకు ఈ మేరకు  నోటీసులు పంపారు. రేపు తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతుల మీదుగా రామ్ గోపాల్ వర్మ అందుకుంటున్నట్టుగా ఓ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశారు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి పాల్ దిగిన ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఇటీవలే ఆయన ఫిర్యాదు చేశారు.