ఐటీ గ్రిడ్స్ సీఈవోకు నోటీసులు

 ఐటీ గ్రిడ్స్ సీఈవోకు నోటీసులు

ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాలని  నోటీసులో తెలిపారు. ఇప్పటి వరకు నలుగురి ఐటీ గ్రిడ్‌ ఉద్యోగులకి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పి ఎవరో తీసుకెళ్లారని హైకోర్టులో సంస్థ సీఈఓ అశోక్‌  హెబియస్‌ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఏపీ పోలీసుల బెదిరింపులపై లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను క్లోడ్ సర్వర్ లో భద్రపరచగా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ను  డీకోడ్  చేసే పనిలో ఐటీ నిపుణులు నిమగ్నమయ్యారు.