రాంగ్ రూట్ ప్రయాణం..మరొకరి కొంప ముంచింది !

రాంగ్ రూట్ ప్రయాణం..మరొకరి కొంప ముంచింది !

హైదరాబాద్‌ మియాపూర్‌లో ఓ వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్లడానికి ప్రయత్నించడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఆ వీడియోను సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. తప్పొకరు చేస్తే....శిక్ష ఒకరికి పడింది. సిగ్నల్ దగ్గర బండి ఆపకుండా రాంగ్ రూట్‌ లో వెళ్లాలనుకున్న ఓ వ్యక్తి...ప్రమాదానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్‌ పోలీసులు ట్వీట్ చేశారు. రాంగ్‌ రూట్‌లో వెళ్లేందుకు ప్రయత్నిస్తూ రోడ్డు మధ్యలోకి రావడంతో..అటుగా వస్తున్న మరో వాహనం అదుపుతప్పి పాదచారున్ని ఢీకొట్టింది. రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణం కావొద్దంటూ సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను ట్వీట్ చేశారు.