బంగాళాఖాతంలో సైక్లోన్ బురేవి... అప్రమత్తమైన ఏపీ... 

బంగాళాఖాతంలో సైక్లోన్ బురేవి... అప్రమత్తమైన ఏపీ... 

నివర్ తుఫాన్ ధాటికి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది.  చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.  దీని నుంచి బయటపడకముందే బంగాళాఖాతంలో మరో వాయుగుండం పడింది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.  ఈ తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.  డిసెంబర్ 2 వ తేదీన బురేవి తుఫాన్ తీవ్రమైన ప్రభావం చూపబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ తుఫాన్ ప్రభావం వలన ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రతో పటు రాయలసీమపై దీని ప్రభావం ఉండబోతున్నది.  అంతేకాదు, డిసెంబర్ 5 వ తేదీన ఏర్పడే అల్పపీడనంతో టకేటీ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  దీంతో ఏపీ అప్రమత్తం అయ్యింది.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది.